ఖైదీ మొఖంలో సంతోషాన్ని నింపిన దుబాయ్ పోలీసులు

- August 01, 2023 , by Maagulf
ఖైదీ మొఖంలో సంతోషాన్ని నింపిన దుబాయ్ పోలీసులు

దుబాయ్: దుబాయ్ పోలీస్‌లోని శిక్షా, కరెక్షనల్ ఇన్‌స్టిట్యూషన్‌ల జనరల్ డిపార్ట్‌మెంట్ ఖైదీ,  అతని కొడుకు మధ్య హృదయపూర్వక భేటీని ఏర్పాటు చేసింది. ఖైదీ ఎల్లప్పుడూ తన కుమారుడి చిత్రాలను గీస్తుండడం గమనించి, అతని పట్ల అతనికి ఉన్న ప్రేమను, లోతైన కోరికను గుర్తించి ఈ ఏర్పాట్లు చేసింది. ఈ క్షణం 'ఖైదీల సంతోషం' మానవతా చొరవ ద్వారా సాధ్యమైంది. ఇది ఖైదీల శిక్షా సమయంలో వారి బాధలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది.

దుబాయ్ పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి మార్గదర్శకత్వంలో.. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అఫైర్స్ అసిస్టెంట్ కమాండర్-ఇన్-చీఫ్ మేజర్ జనరల్ ఖలీల్ ఇబ్రహీం అల్ మన్సూరి పర్యవేక్షణలో ఈ మానవతా కార్యక్రమాన్ని తీసుకొచ్చారు.

ఖైదీకి ఉన్న ఏకైక కుమారుడు వేరే దేశంలో ఉంటున్నాడని తెలుసుకున్న తర్వాత, తండ్రి మరియు అతని కొడుకుల మధ్య సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి డిపార్ట్‌మెంట్ సమన్వయం చేసిందని శిక్షా మరియు కరెక్షనల్ ఇనిస్టిట్యూషన్స్ జనరల్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ మార్వాన్ జల్ఫర్ చెప్పారు.తొలుత ఖైదీని కలిసేందుకు సందర్శకుడు వచ్చాడని చెప్పగానే.. తన వద్దకు వచ్చేవారు ఎవరూ లేకపోవడంతో  అతను అవాక్కయ్యాడు. తన కొడుకును చూసిన ఖైదీ.. ఆనందంతో తన కొడుకును కౌగిలించుకొని భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. వారి హృదయపూర్వకమైన పునఃకలయిక ఒక అద్భుతమైన క్షణమని,  ఇది అక్కడి వారందరిని కదిలించిందని బ్రిగేడియర్ మార్వాన్ జల్ఫర్ వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com