మలై జామూన్ పలావ్
- June 24, 2015
బాస్మతి రైస్ : 500గ్రా
కోవా : 200గ్రా
పనీర్ : 50 గ్రా
గరం మసాలా : 2 టీ స్పూన్లు
పచ్చిమిర్చి : 4
పలావు ఆకులు : 2
నెయ్యి : 3 టేబుల్ స్పూన్లు
నూనె : వేయించడానికి సరపడా
ఉల్లిపాయలు : 3
పెరుగు : 3 టేబుల్ స్పూన్లు
పుదీనా : ఒక కట్ట
కొత్తిమీర : ఒక కట్ట
షాజీరా : అర టీ స్పూను
కుంకుమ పువ్వు : చిటికెడు
తయారీ విధానం
ఒక బాణలి తీసుకుని దానిలో పన్నీర్, కోవా వేసి మెత్తగా చిదమాలి. దానికి సరిపడా ఉప్పు, ఒక చెంచా గరం మసాలా, తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసి, ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న జామూన్‌ల్లా చేసి నూనెలో వేసి గోధుమరంగులోకి వచ్చేలా వేయించి పక్కన ఉంచాలి. ఇప్పుడు అదే నూనెలో అల్లం, వెల్లుల్లి , ఉప్పు, గరం మసాలా,రెండు లీటర్ల నీళ్లు పోసి మరిగించాలి. తరువాత దానిలో బియ్యం వేసి కాస్త పలుకు ఉండేలా ఉడికించి దించాలి. ఇప్పుడు వేరే బాణలి తీసుకుని దానిలో కొద్దిగా నూనె పోసి అందులో పెరుగు, మిగిలిన పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా తురుము, కొత్తిమీర తురుము, కొద్దిగా గరం మసాలా, సరిపడా ఉప్పు వేసి కలిపి, అందులో వేయించిన జామూన్‌లు కూడా వేసి కలపాలి. ఇప్పుడు ఒక మందపాటి బాణలి తీసుకుని అడుగున ఉడికించిన అన్నం ఒక పొరలా వేసి దానిపై జామూన్స్ కలిపిన మిశ్రమం వేసి, దానిపై మిగిలిన అన్నాన్ని సర్దాలి. ఆ పైన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పుదీనా తురుము, కొత్తిమీర తురుము, నెయ్యి, కుంకుమ పువ్వు, అవసరం అనుకుంటే కొద్దిగా వేయించిన జీడిపప్పు చల్లినట్లుగా వేసి, మూత పెట్టి, పది నిముషాలు దమ్ చేసి తీయాలి. వేడి వేడిగా దమ్ మలై జామూన్ పలావ్ రెడీ!
తాజా వార్తలు
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?







