2016 తొలి క్వార్టర్‌లో 8.8 మిలియన్ ప్యాసింజర్లు
- May 16, 2016
హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (హెచ్‌ఐఏ) 2016 తొలి క్వార్టర్‌లో 8.8 మిలియన్ ప్రయాణీకులకు సేవలందించి, సరికొత్త రికార్డును సృష్టించింది. గత ఏడాది ఇదే సీజన్‌లో ప్రయాణించిన ప్రయాణీకులతో పోల్చితే ఈ ఏడాది 20 శాతం వృద్ధి నమోదు చేసింది. మొత్తం 8,867,971 మంది ప్రయాణీకులు తొలి క్వార్టర్‌లో ప్రయాణించారు. ఇందులో ఒక్క జనవరిలోనే 3,089,826 ప్రయాణీకులు ప్రయాణం చేయడం గొప్ప విషయం. ఎయిర్ ట్రాఫిక్ విషయంలో కూడా గణనీయమైన వృద్ధి సాధించింది. ఈ వృద్ధి 8.6 శాతంగా ఉంది. కార్గో విభాగంలో కూడా హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ స్థిరమైన వృద్ధిని నమోదు చేసిందని ఎయిర్ పోర్ట్ వర్గాలు వెల్లడించాయి. ఖతార్ డ్యూటీ ఫ్రీ, ప్రీమియర్ షాపింగ్ ఎంపోరియమ్, బోటిక్స్, కేఫ్‌లు, రెస్టారెంట్లు వంటి సౌకర్యాలతో ప్రయాణీకులకు సరికొత్త ప్రయాణానుభూతిని మిగుల్చుతోంది హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. ఇందులోని రెండు రన్‌వేలు డ్యూయల్ కెపాసిటీతో పనిచేస్తున్నాయి
తాజా వార్తలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!









