ఛార్మి తన బర్త్ డే వేడుకలను కుటుంబ సభ్యుల మధ్య గ్రాండ్ గా జరుపుకుంది..

- May 17, 2016 , by Maagulf
ఛార్మి  తన బర్త్ డే వేడుకలను కుటుంబ సభ్యుల మధ్య గ్రాండ్ గా జరుపుకుంది..

టాలీవుడ్ బొద్దుగుమ్మ ఛార్మి ఈ సంవత్సరం తన బర్త్ డే వేడుకలను కుటుంబ సభ్యుల మధ్య గ్రాండ్ గా జరుపుకుంది. 1987, మే 17న జన్మించిన ఛార్మి నేటితో 29వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. నటిగా, నిర్మాతగా మంచి సక్సెస్‌లు సాధించిన ఛార్మి మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు, హిందీ చిత్రాలతో కలిపి దాదాపు 40 సినిమాలలో నటించింది. ఇక ఈ అమ్మడికి మాస్, అనుకోకుండా ఒక రోజు, పౌర్ణమి, రాఖీ సినిమాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇక ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన జ్యోతి లక్ష్మీ చిత్రం ఛార్మీకు విమర్శకుల నుండి ప్రశంసలు తెచ్చిపెట్టింది. మహేష్ బాబు, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో జనగణమన అనే చిత్రం త్వరలో రూపొందనుండగా, చిత్ర టైటిల్ ఛార్మి క్రియేషన్ బ్యానర్ పై రిజిస్టర్ అయినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాను ఛార్మీ నే నిర్మించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఛార్మి, తను ఎంచుకున్న రూట్‌లో మరిన్ని సక్సెస్‌లు సాధిస్తూ ముందుకెళ్ళాలని మనసారా కోరుకుందాం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com