వరదల్లో దెబ్బతిన్న వాహనాలకు పోలీసు సర్టిఫికేట్ పొందడం ఎలా?
- August 08, 2023
యూఏఈ: ఎమిరేట్‌లో భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా వాహనాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అయితే, వరదల్లో దెబ్బతిన్న వాహనాలకు నివాసితులు తమ నుంచి అధికారిక ధృవీకరణ పత్రాన్ని పొందవచ్చని షార్జా పోలీసులు ప్రకటించారు. వాహనదారులు తమ యాప్ నుండి ‘to whom it may concern’ ఆప్షన్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని షార్జా పోలీసులు తెలిపారు. వాహనదారులు ఆ సర్టిఫికెట్‌ను బీమా కంపెనీలకు సమర్పించవచ్చని తెలిపారు. షార్జా పోలీస్ యాప్‌లో వాహనదారులు 'పోలీస్ సేవలు' ఎంపికను ఎంచుకోవాలి. ఆపై ‘to whom it may concern’ ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి. అనంతరం వాహనానికి జరిగిన నష్టం, ఎక్కడి-ఎప్పుడు జరిగింది, ఫోటోలు-యాజమాన్యం -బీమా గురించి వివరాలను తెలిపాల్సి ఉంటుంది. గత మూడు రోజులుగా యూఏఈలో కురుస్తున్న భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా కొన్ని సందర్భాల్లో పార్క్ చేసిన వాహనాలపై చెట్లు, కొమ్మలు పడటంతో వాటికి నష్టం ఏర్పడింది. అయితే, సమగ్ర బీమా ప్యాకేజీలు సాధారణంగా వాతావరణం, వర్షాలకు సంబంధించిన నష్టాలను కవర్ చేయడంతో వాహనదారులు పోలీసుల నుంచి సర్టిఫికేట్ పొంది ఇన్సూరెన్స్ కంపెనీలకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!









