యూఏఈ లో వీసాల గడువు ముగిస్తే.. రోజుకు 50 Dhs జరిమానా
- August 08, 2023
యూఏఈ: యూఏఈలో రెసిడెన్సీ, విజిట్ వీసా గడువు ముగిసిన తర్వాత రోజుకు 50 Dhs జరిమానా విధించనున్నట్లు యూఏఈ డిజిటల్ ప్రభుత్వం వెల్లడించింది. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ నేషనాలిటీ, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ ప్రకారం.. గ్రేస్ పీరియడ్ ముగిసిన తర్వాత ప్రతి రోజు 50 Dhs జరిమానా ఉంటుందని అధికారులు తెలిపారు. దేశంలో నివసిస్తున్న విదేశీయులు, పర్యాటకులు వీసా జారీ, పొడిగింపు లేదా రద్దు సేవ కోసం చెల్లించాల్సిన రుసుము తెలుసుకునేందుకు.. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ, ఫారినర్స్ అఫైర్స్ దుబాయ్ వెబ్సైట్లను, సేవా కేంద్రాలను సందర్శించాలని డిజిటల్ ప్రభుత్వం పిలుపునిచ్చింది. అదే విధంగా ప్రవేశ అనుమతి, వీసా సేవ కోసం అభ్యర్థనను అధికార వెబ్సైట్, స్మార్ట్ అప్లికేషన్, "దుబాయ్ నౌ" వెబ్సైట్, టైపింగ్ సెంటర్ల ద్వారా సమర్పించవచ్చని అధికారులు సూచించారు. వీసా దరఖాస్తు కోసం ఎలక్ట్రానిక్ ఛానెల్‌లు ఉన్నాయని, వాటి ద్వారా ఎంట్రీ పర్మిట్ లేదా నివాస అనుమతి కోసం అభ్యర్థనను సమర్పించవచ్చని అధికారులు తెలిపారు. ఆ అప్లికేషన్లు Google, Apple స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. వీసా లేదా ఎంట్రీ పర్మిట్ పొందడం కోసం దరఖాస్తును నేరుగా, అథారిటీతో నమోదు చేసుకున్న టైపింగ్ కార్యాలయాలు లేదా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ దుబాయ్ ద్వారా గుర్తింపు పొందిన కార్యాలయాల ద్వారా సమర్పించవచ్చని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!









