బహ్రెయిన్‌లో 1902 నుండి రెండవ హాటెస్ట్ ‘జూలై’

- August 08, 2023 , by Maagulf
బహ్రెయిన్‌లో 1902 నుండి రెండవ హాటెస్ట్ ‘జూలై’

బహ్రెయిన్: 1902 నుండి బహ్రెయిన్‌లో జూలై 2023 అత్యంత వేడిగా ఉండే రెండవ జూలై నెలగా నిలిచిందని అని వాతావరణ డైరెక్టరేట్ నివేదించింది. నెల సగటు ఉష్ణోగ్రత 36.6°C, ఇది దీర్ఘకాలిక సాధారణం కంటే 1.5°C ఎక్కువ అని తెలిపారు. బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జూలై 31న అత్యధిక ఉష్ణోగ్రత 46.3°C నమోదైంది. జూలై 8 మరియు 11 తేదీల్లో బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యల్ప ఉష్ణోగ్రత 31.3°C నమోదైంది. 1968లో అత్యధిక ఉష్ణోగ్రతల రికార్డులు ప్రారంభమైనప్పటి నుండి అత్యధిక ఎండల తీవ్రత అధికంగాఉన్న రెండు జులై నెలలు అత్యధిక ఉష్ణోగ్రతల నమోదుతో రికార్డుల్లో నమోదైనట్లు డైరెక్టరేట్ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com