పొరుగు దేశాల ప్లేట్ నంబర్లతో తిరుగుతున్న బెగ్గర్స్ ముఠా అరెస్ట్
- August 08, 2023
యూఏఈ: మసీదు ప్రవేశాలు, క్లినిక్‌లు, ఆసుపత్రులు, దుకాణాలు మరియు రోడ్ల ముందు భిక్షాటన చేసే వారిపట్ల సానుభూతిని చూపొద్దని దుబాయ్ పోలీసులు సూచించారు. వారు ప్రజలను మోసగించడానికి ఉద్దేశించి కల్పిత కథనాలను చెబుతారని వాటిన చూసి, నమ్మి మోసపోవద్దని కోరారు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ జనరల్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ మేజర్ జనరల్ జమాల్ సలేమ్ అల్ జల్లాఫ్ మాట్లాడుతూ.. దుబాయ్ పోలీసులు యాంటీ-బిగ్గింగ్ క్యాంపెయిన్ ద్వారా అంతర్గత, బాహ్య భాగస్వాముల సహకారంతో యాచించడాన్ని ఎదుర్కోవడానికి తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నారని తెలిపారు. ఇతరుల భావాలను, సానుభూతిని స్వార్థం కోసం వాడుకునే బెగ్గర్స్, వీధి వ్యాపారుల సంఖ్యను తగ్గించడం మరియు అత్యున్నత స్థాయి భద్రత, భద్రతను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు పేర్కొన్నారు. పొరుగు దేశాల ప్లేట్ నంబర్లతో కూడిన వాహనాలను ఉపయోగించే ఆసియా ముఠాను దుబాయ్ పోలీసులు విజయవంతంగా అరెస్టు చేశారని ఆయన తెలిపారు. వారందరూ మహిళలు, పిల్లలతో కలిసి బెగ్గింగ్ చేస్తున్నారని వివరించారు. ఇలాంటివారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, అలాంటి వారి వివరాలను కాల్ సెంటర్ (901), దుబాయ్ పోలీస్ యొక్క "ఐ" ప్లాట్‌ఫారమ్ ద్వారా దాని స్మార్ట్ యాప్ లేదా ఎలక్ట్రానిక్ నేరాలను నివేదించడానికి E-క్రైమ్ సర్వీస్ ద్వారా రిపోర్ట్ చేసి పోలీసులకు సహాయం చేయాలని ప్రజలను కోరారు. 2018లోని ఫెడరల్ లా నంబర్ 9 ప్రకారం యూఏఈలో భిక్షాటన శిక్షార్హమని ఆయన గుర్తుచేశారు.
తాజా వార్తలు
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!









