జూలైలో రికార్డు సృష్టించిన కువైట్ విమానాశ్రయం
- August 09, 2023
కువైట్: జూలైలో మొత్తం 1,447,790 మంది ప్రయాణికులు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు ప్రయాణించి వెళ్లారని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) మంగళవారం తెలిపింది. DGCA తాత్కాలిక డైరెక్టర్ జనరల్ ఇమాద్ అల్-జలావి మాట్లాడుతూ.. విమానాశ్రయంలో ప్రయాణీకుల సంఖ్య 16 శాతం , విమానాల సంఖ్య 23 శాతం పెరిగాయని తెలిపారు. 2022 ఇదే కాలంతో పోల్చితే జూలైలో ఎయిర్ షిప్పింగ్ మూడు శాతం పెరిగిందని ఆయన పేర్కొన్నారు. జూలైలో వచ్చిన వారి సంఖ్య 640,458కి చేరుకోగా, దేశం విడిచి వెళ్లిన ప్రయాణికుల సంఖ్య 806,232గా ఉందన్నారు. రవాణా ప్రయాణీకుల సంఖ్య 166,465కి చేరుకుందని, ఇది 2022 అదే సమయంతో పోలిస్తే 75 శాతం పెరిగిందన్నారు. జూలైలో కువైట్ విమానాశ్రయానికి 12,468 ప్యాసింజర్ విమానాలు వచ్చాయని తెలిపారు. ఎయిర్ షిప్పింగ్‌లో, 12.7 మిలియన్ కిలోల దిగుమతి చేసుకున్న వస్తువులతో సహా 16.1 మిలియన్ కిలోలు రవాణా చేయబడినట్లు ఆయన వెల్లడించారు. పైన పేర్కొన్న కాలంలో దుబాయ్, కైరో, ఇస్తాంబుల్, దోహా మరియు జెద్దా చాలా డిమాండ్ ఉన్న గమ్యస్థానాలు అని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









