‘నేషనల్ లేబర్ మార్కెట్ ప్లాన్’తో ఉద్యోగ అవకాశాల సృష్టి
- August 09, 2023
బహ్రెయిన్: నేషనల్ లేబర్ మార్కెట్ ప్లాన్ 2023-2026 ద్వారా లేబర్ మార్కెట్లోని పరిణామాలు, మార్పులకు అనుగుణంగా ప్రణాళిక లక్ష్యాలను సాధించాల్సి ఉంటుందని లేబర్ మరియు సామాజిక అభివృద్ధి మంత్రి జమీల్ బిన్ ముహమ్మద్ అలీ హుమైదాన్ స్పష్టం చేశారు. LMRA సమావేశానికి అధ్యక్షత వహించిన సందర్భంగా హుమైదాన్ ఆ మేరకు వ్యాఖ్యానించారు. ఈ సమావేశానికి ఎల్ఎంఆర్ఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నౌఫ్ అబ్దుల్రహ్మాన్ జంషీర్ హాజరయ్యారు.
జాతీయ ప్రణాళిక కార్మిక మార్కెట్‌ను అభివృద్ధి చేయడం, దాని వృద్ధి మరియు స్థిరత్వాన్ని నిర్ధారించడం, ఆర్థిక పోటీతత్వాన్ని పెంపొందించడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడం, తద్వారా పౌరులకు మరింత స్థిరమైన ఉద్యోగ అవకాశాల సృష్టికి నేషనల్ లేబర్ మార్కెట్ ప్లాన్ దోహదపడుతుందన్నారు. ఇది ఆర్థిక పునరుద్ధరణ ప్రణాళికతో సహా బహ్రెయిన్ ఎకనామిక్ విజన్ 2030 ప్రణాళికలకు అనుగుణంగా ఉంటుందని పేర్కొన్నారు. జాయింట్ ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్లు, కవరింగ్ షాపులు, వర్క్ సైట్లు, లేబర్లు గుమిగూడే ప్రదేశాల ద్వారా కార్మిక మార్కెట్‌ను పర్యవేక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతాయని మంత్రి సూచించారు. 2023 సంవత్సరానికి అంచనా వేసిన బడ్జెట్‌ను, రాబోయే ప్రణాళికలను కూడా సమీక్షించారు. పౌరులు, వ్యాపార యజమానులు మరియు కార్మికులకు అందించిన సేవల విజయాలు, అభివృద్ధిపై జంషీర్ సమగ్ర నివేదికను సమర్పించారు.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









