అదే చిరంజీవి గొప్పతనం.!

- August 09, 2023 , by Maagulf
అదే చిరంజీవి గొప్పతనం.!

రీల్ చిరంజీవి అంటే అందరికీ అభిమానమే. కానీ, రియల్ లైఫ్‌లో చిరంజీవిని చూస్తే అభిమానిగా కాదు, భక్తుడైపోతారు.. అని చాలా మంది చెబుతుంటారు. తాజాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ శీను, చిరంజీవిని వుద్దేశించి ఈ మాట చెప్పారు.

చిరంజీవి తాజా సినిమా ‘భోళా శంకర్’ ప్రమోషన్లలో భాగంగా సినిమాలో నటించిన కమెడియన్లు గెటప్ శీను, వైవా హర్ష, లోబో, తాగుబోతు రమేష్.. ఇలా చాలా మంది కమెడియన్లతో కలిసి చిరంజీవి ఓ సరదా ఇంటర్వ్యూ చేశారు.

ఈ ఇంటర్వ్యూలో భాగంగా కమెడియన్లంతా చిరంజీవికి తమ కృతజ్ఢతలు తెలుపుకున్నారు. లోబో అయితే, ‘భోళా శంకర్’ రిలీజ్ డే తర్వాత తాను చనిపోయినా ఫర్వాలేదు.. అంటూ తన ఎమోషన్ బయటపెట్టాడు. చిరంజీవితో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకోవడమన్నది తమకు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అనీ, ఆ కల నెరవేరినందుకు ఈ జీవితానికి ఆ భాగ్యం చాలన్నదే వారి వుద్దేశ్యం. 

వారి వారి టాలెంట్స్ గుర్తించిన చిరంజీవి చాలా మంది కమెడియన్లకు ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. చిన్న చిన్న సన్నివేశాలే అయినా వారందర్నీ ఎంతో చక్కగా హ్యాండిల్ చేశాడట మెహర్ రమేష్. ఆగస్టు 11న ‘భోళా శంకర్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. కేవలం మెగా అభిమానుల్నే కాదు, అన్ని వర్గాల వారినీ ఈ సినిమా అలరిస్తుందని ఈ ఇంటర్వ్యూలో చిరంజీవి చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com