దుబాయ్‌లో వేజ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌

- May 17, 2016 , by Maagulf
దుబాయ్‌లో వేజ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌

కంపెనీలు తమ ఉద్యోగులకు జీత భత్యాల చెల్లింపులు ఎలా చేస్తున్నాయనే విషయాన్ని మానిటరింగ్‌ చేసేందుకోసం వేజ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ని ఏర్పాటు చేయనుంది. నాలుగు ప్రభుత్వ శాఖలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఆరెంజ్‌ టీమ్‌ ఈ సిస్టమ్‌ని రూపొందిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సిస్టమ్‌ని అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ మానిటిరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ - దుబాయ్‌ పోలీస్‌ డైరెక్టర్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ డాక్టర్‌ సుల్తాన్‌ అబ్దుల్‌ హమీద్‌ అల్‌ జమాల్‌ చెప్పారు. ఆరెంజ్‌ టీమ్‌ కో-ఆర్డినేటర్‌ కూడా అయిన అల్‌ జమాల్‌ మాట్లాడుతూ, కార్మికులు ఆరోగ్యకరమైన వర్క్‌ ఎన్విరాన్‌మెంట్‌లో పనిచేసేలా యజమానులు చర్యలు తీసుకోవాలనీ, ఈ దిశగానే ఈ ఆరెంజ్‌ టీమ్‌ పరిస్థితుల్ని పర్యవేక్షిస్తుందని చెప్పారు. కార్మికుడి కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చేలా చూడటం ఆరెంజ్‌ టీమ్‌ బాధ్యత అని ఆయన వివరించారు. దుబాయ్‌ కోర్ట్స్‌, దుబాయ్‌ పోలీస్‌, పర్మనెంట్‌ కమిటీ ఫర్‌ లేబర్‌ ఎఫైర్స్‌, మినిస్ట్రీ ఆఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ అండ్‌ ఎమిరటైజేషన్‌ విభాగాలు సంయుక్తంగా ఈ ఆరెంజ్‌ టీమ్‌ని ఏర్పాటు చేశాయి. వలస కార్మికులకు ఇక్కడి చట్టాల గురించి అవగాహన కల్గించే కార్యక్రమాలు చేపట్టడం, అలాగే వారి హక్కులు, బాధ్యతల గురించి తెలియజేయడం అనే ముఖ్యమైన ఉద్దేశ్యంతో ఆదివారం ఆరెంజ్‌ టీమ్‌ ప్రతినిథులు ఓ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com