ఎయిర్ ఇండియా మేకోవర్. కొత్త లోగో, డిజైన్ ఆవిష్కరణ

- August 11, 2023 , by Maagulf
ఎయిర్ ఇండియా మేకోవర్. కొత్త లోగో, డిజైన్ ఆవిష్కరణ

యూఏఈ: ప్రైవేట్ ఇండియన్ ఎయిర్‌లైన్ ఎయిర్ ఇండియా తన కొత్త లోగో, కొత్త ఎయిర్‌క్రాఫ్ట్ లివరీ, డిజైన్‌ను గురువారం ఆవిష్కరించింది. టాటా గ్రూప్ క్యారియర్‌ను టేకోవర్ చేసి, ప్రైవేటీకరించిన ఒక సంవత్సరం తర్వాత మేకోవర్ వచ్చింది. ఆగస్ట్ 10న ఒక ట్వీట్‌లో ఎయిర్ ఇండియా తన న్యూ లుక్ ని వెల్లడించింది. ఈ సంవత్సరం డిసెంబర్ నుండి ప్రయాణికులు కొత్త డిజైన్లను చూడవచ్చని ఎయిర్ ఇండియా తెలిపింది. తాజా డిజైన్‌లో ఎయిర్ ఇండియా పాత గుర్తులో భాగమైన ఐకానిక్ 'మహారాజా' కొత్త లుక్‌లో కనిపించనుంది. ఎయిర్ ఇండియా కొత్త లోగోను కంపెనీ సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ ఆవిష్కరించారు. తమ కొత్త బ్రాండ్ ఎయిర్ ఇండియాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిథులకు సేవలందించే ప్రపంచ స్థాయి ఎయిర్‌లైన్‌గా మార్చాలనే ఆశయాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com