అజ్మాన్ రెసిడెన్షియల్ టవర్‌లో భారీ అగ్ని ప్రమాదం

- August 12, 2023 , by Maagulf
అజ్మాన్ రెసిడెన్షియల్ టవర్‌లో భారీ అగ్ని ప్రమాదం

అజ్మాన్ రెసిడెన్షియల్ టవర్‌లో భారీ అగ్ని ప్రమాదం

యూఏఈ: అజ్మాన్ లోని రెసిడెన్షియల్ టవర్‌లో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.  షేక్ ఖలీఫా బిన్ జాయెద్ స్ట్రీట్‌లోని అల్-నైమ్యా ప్రాంతంలోని 15 అంతస్తుల నివాస భవనంలో ఈ మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరిగిందని అజ్మాన్ పోలీసులు ట్వీట్ చేశారు. అయితే, ఇప్పటివరకు ఎవరూ గాయపడ్డట్టు సమాచారం లేదు. నివాసితులను అధికారులు ఖాళీ చేయించినట్టు పోలీసు ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ మేజర్ అబ్దుల్లా సైఫ్ అల్-మత్రౌషి తెలిపారు.  ఈ సంఘటనలో 16 అపార్ట్‌మెంట్లు, 13 దెబ్బతిన్న వాహనాలు దగ్ధమయ్యాయని పేర్కొన్నారు. కాగా, అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com