అధునాతన మొబైల్ యాప్‌ను విడుదల చేసిన స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్
- August 12, 2023
హైదరాబాద్ కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న డయాగ్నస్టిక్ సర్వీసెస్ సంస్థ , స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ ఈరోజు తమ అధునాతన, వినియోగదారు-అనుకూల మొబైల్ అప్లికేషన్‌ను విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ శాఖల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఈ యాప్‌ను సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (SCSC) ఎగ్జిక్యూటివ్ కమిటీ సొసైటీ, మమత వేగుంట మరియు మెడికవర్ హాస్పిటల్స్. చైర్మన్ - మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి అనిల్ కృష్ణ, డాక్టర్ శరత్ రెడ్డి , స్ప్రింట్ డయాగ్నస్టిక్స్ COO కృష్ణ చైతన్య గారు సమక్షంలో విడుదల చేశారు.
ఈ యాప్ కేవలం ఒక్క స్వైప్‌తో ఆరోగ్య సంరక్షణ అనుభవాన్ని విప్లవాత్మకంగా మారుస్తుందని భావిస్తున్నారు, కస్టమర్లు సేవలు, సమాచారం మరియు అప్డేట్లను వేగంగా, సులభంగా మరియు సజావుగా అందించటంలో సహాయపడుతుంది.
ఈ సందర్భంగా జయేష్ రంజన్ మాట్లాడుతూ “ఆరోగ్య సంరక్షణ రంగం డిజిటల్ పరివర్తన దిశగా వెళ్తోంది. తెలంగాణ ప్రభుత్వం తమ వంతుగా, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడం, డిజిటల్ సేవలను ఎక్కువగా వినియోగించటం ప్రోత్సహిస్తుంది. ఈ విషయంలో ఆరోగ్య సంరక్షణ, సాంకేతికత సంస్థలకు నిరంతరం మద్దతు ఇస్తోంది. వాల్యూ-యాడెడ్ హెల్త్‌కేర్ ఫీచర్లు, అప్డేట్లతో పాటు డయాగ్నొస్టిక్ సేవలను కోరుకునే కస్టమర్లకు ఈ యాప్ చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను ” అని అన్నారు.
మమత వేగుంట మాట్లాడుతూ హెల్త్‌కేర్ మరియు వెల్నెస్ రంగంలో డిజిటల్ అంశాల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. “డయాగ్నోస్టిక్స్ మరియు టెలిమెడిసిన్ కోసం మొబైల్ యాప్‌లు ఇక ఎంతమాత్రం విలాసవంతమైన ఎంపిక కాదు, ముఖ్యంగా కోవిడ్ 19 తర్వాత అవి అవసరంగా మారాయి" అని అన్నారు.
డాక్టర్ అనిల్ కృష్ణ మాట్లాడుతూ కస్టమర్లు తమను తాము అప్డేట్ చేసుకోవడం తో పాటుగా తమ ఆరోగ్య రికార్డులు , కీలకాంశాలను ట్రాక్ చేయడం ద్వారా యాప్‌ను ఉత్తమంగా ఉపయోగించుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా,స్ప్రింట్ డయాగ్నస్టిక్స్ COO కృష్ణ చైతన్య గారు మాట్లాడుతూ స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ పలు ఆఫర్లను ప్రకటించింది, ఇందులో పరీక్షల కోసం నగదు సమానమైన 1000 క్రెడిట్లు, ఆన్లైన్ చెల్లింపులపై పరిమిత కాలం పాటు 20 శాతం తగ్గింపు వంటివి వున్నాయి.
తాజా వార్తలు
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..









