‘సూపర్’ అప్డేట్ ఇంకెప్పుడు జక్కన్నా.!

- August 17, 2023 , by Maagulf
‘సూపర్’ అప్డేట్ ఇంకెప్పుడు జక్కన్నా.!

‘ఆర్ఆర్ఆర్’ సినిమా వచ్చి ఇన్నాళ్లు గడుస్తున్నా.. ఇంకా రాజమౌళి నుంచి ఎలాంటి అప్డేట్ రావడం లేదు. అదేనండీ.! ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత జక్కన్న రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి స్ర్కిప్టు వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, రీసెంట్‌గా మహేష్ బాబు పుట్టినరోజున రాజమౌళి నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ, రాలేదు.

ఓ వైపు మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్నప్పటికీ, రాజమౌళితో చేయబోయే ప్రాజెక్ట్ పైనే ఫ్యాన్స్‌లో ఎక్కువ క్యూరియాసిటీ నెలకొంది. తాజాగా ‘బాహుబలి’ సినిమాకి సంబంధించిన జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటూ జక్కన్న తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు సూటిగా జక్కన్నను ప్రశ్తిస్తున్నారు. 

మా హీరో సినిమా అప్డేట్ ఎప్పుడంటూ.! అంతే మరి, ఎప్పటి ‘బాహుబలి’ సినిమా.. అప్పటికీ ఇప్పటికీ ఆ తర్వాత ఎన్ని ఫ్లాపులొచ్చినా ప్రబాస్ ఇమేజ్‌కి ఏ మాత్రం మకిలి అంటలేదు. జక్కన్న సినిమానా మజాకానా.? ఆ రేంజ్‌లో వుంటుంది మరి. 

ఆర్ఆర్ఆర్‌ తో రామ్ చరణ్, ఎన్టీయార్‌లు గ్లోబల్ స్టార్స్ అయిపోయారు. ఇక మహేష్ బాబు నుంచి ఆ రేంజ్ క్రేజ్ ఎప్పడెప్పుడా అని ఫ్యాన్స్‌లో కుతూహలం వుండడంలో ఆశ్చర్యమేముంది వుంటుంది మరి.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com