బిగ్బాస్కెళ్తే ఇక అంతే సంగతి.! రాఖీ సావంత్ సంచలన వ్యాఖ్యలు.!
- August 18, 2023
బాలీవుడ్ ఐటెం బాంబ్ రాఖీ సావంత్ తనకు గుర్తొచ్చినప్పుడల్లా ఎంతో కొంత పబ్లిసిటీ మూట కట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. ఆ క్రమంలోనే తాజాగా బిగ్‌బాస్ హంగామా నడుస్తున్న నేపథ్యంలో బిగ్‌బాస్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
బిగ్‌బాస్ హౌస్‌కి వెళ్తే కెరీర్ సర్వ నాశనమే అని వ్యాఖ్యానించింది తాజాగా రాఖీ సావంత్. తనలాగే చాలా మంది బిగ్‌బాస్ హౌస్ నుంచి వచ్చాకా కెరీర్లో ఏమీ సాధించలేకపోయారనీ, అంతకు ముందే కాస్తో కూస్తో పాపులారిటీ వున్నోళ్లు కాస్తా ఆ పాపులారిటీని కోల్పోవాల్సి వచ్చిందనీ, ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు రాక, ఇంకెక్కడా నిలదొక్కుకోలేక.. చాలా ట్రబుల్స్ ఫేస్ చేశారనీ వ్యాఖ్యానించింది.
రాఖీ సావంత్ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయ్. హాట్ ఐటెం బాంబ్ రాఖీ సావంత్ సినిమాల్లో పెద్దగా సాధించింది లేకపోయినా ఇదిగో ఇలాంటి హాట్ హాట్ పబ్లిసిటీ స్టంట్లతోనే హాట్ టాపిక్ అయ్యింది. తాజా వ్యాఖ్యలతో ఆమె ఏం సాధించాలనుకుంటుందో ఏమో కానీ, బిగ్‌బాస్ లవర్స్ మాత్రం ఆమె వ్యాఖ్యల పట్ల ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్‌లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్‌లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో మెడిసిన్ స్టాక్ పై ఆందోళన వద్దు..!!









