ఒమన్‌లో నవంబర్ లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్

- August 20, 2023 , by Maagulf
ఒమన్‌లో నవంబర్ లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్

మస్కట్: ఈ ఏడాది రెండో ఎడిషన్‌లో అల్ బతినా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ తేదీలను వెల్లడించారు. "హ్యుమన్ రిలేషన్ షిప్ విత్ ల్యాండ్" అనే నినాదంతో నవంబర్ 12-15 వరకు ఈ ఫెస్టివల్ ను నిర్వహించనున్నారు. ఇందులో ఒమానీ మరియు అంతర్జాతీయ లఘు కథన చిత్ర పోటీ, ఒమానీ మరియు అంతర్జాతీయ షార్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ పోటీలు ఇతర కార్యక్రమాలను షెడ్యూలో పేర్కొన్నారు. సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల కోసం కొత్త పోటీని ప్రకటించారు. విద్యార్థుల్లో కమ్యూనికేషన్, మానవవిలువలను పెంపొందించే లక్ష్యంతో రూపొందించిన డాక్యుమెంటరీలను ఆహ్వానిస్తున్నట్లు  ఫెస్టివల్ అధినేత డాక్టర్ హమీద్ అల్ అమెరి తెలిపారు. సమాజంలో సినిమా సంస్కృతిని వ్యాప్తి చేయడం, అంతర్జాతీయ సినిమా పరిశ్రమకు భవిష్యత్ ఫ్రంట్‌గా ఒమన్ సుల్తానేట్‌ను ప్రచారం చేయడం ఈ ఫెస్టివల్ ప్రధాన లక్ష్యమన్నారు.  ఫెస్టివల్ లో పాల్గొనాలనుకునే వారు అక్టోబర్ 1  వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com