నౌకాదళ సహకారంపై చర్చించిన ఇండియా, కువైట్
- August 22, 2023
కువైట్: కమాండర్ ఆఫ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ వెస్ట్రన్ ఫ్లీట్, రియర్ అడ్మిరల్ వినీత్ మెక్‌కార్టీ సోమవారం కువైట్ నేవల్ ఫోర్సెస్ కమాండర్ మేజర్ జనరల్ హజ్జా ముత్లాక్ అల్-అలాటితో సమావేశమయ్యారు. భారత నావికాదళం, కువైట్ నావల్ ఫోర్స్ మధ్య ద్వైపాక్షిక సహకారంపై ఈ సందర్భంగా చర్చించారు. అలాగే ఇరు దేశాల మధ్య సైనిక సహకారంపై చర్చించారు. భారత నౌకాదళ నౌక INS విశాఖపట్నం పర్యటనలో భాగంగా రియర్ అడ్మిరల్ వినీత్ మెక్‌కార్టీ మరియు అతని బృందం కువైట్‌లో ఉన్న విషయం తెలిసిందే. భారత నౌకాదళం, కువైట్ నౌకాదళం మధ్య సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో INS విశాఖపట్నం కువైట్ నౌకాదళంతో సంయుక్త నౌకాదళ విన్యాసాలను నిర్వహిస్తోంది.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్‌లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









