SR 500000 స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ప్రవాసుడు

- August 22, 2023 , by Maagulf
SR 500000 స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ప్రవాసుడు

రియాద్: రాజ్యం నుండి SR500000  నగదును అక్రమంగా తరలించడానికి ఒక ఆసియా జాతీయుడు చేసిన ప్రయత్నాన్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ అధికారులు అడ్డుకున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సౌదీ ఎయిర్ పోర్ట్ లో ఓ ప్రవాసుడు స్మగ్లింగ్ బ్బుతో పట్టుబడ్డాడు. మనీలాండరింగ్ ఆరోపణల కింద ప్రవాసుడిపై పబ్లిక్ ప్రాసిక్యూషన్‌లోని ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తును పూర్తి చేసింది. నిందితుడు రాజ్యాన్ని విడిచి వెళ్లేందుకు ప్రయత్నించిన సందర్భంగా డబ్బును సంచిలో దాచుకున్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడిని న్యాయస్థానానికి రిఫర్ చేశారు. అతనిపై అభియోగాలను రుజువు చేయడానికి సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com