సోషియో ఫాంటసీ కథతో మరింత కొత్తగా రాబోతున్న మెగాస్టార్
- August 22, 2023
హైదరాబాద్: చిరంజీవి భోళా శంకర్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో నెక్స్ట్ సినిమా ఏంటా అని అంతా ఎదురు చూస్తన్నారు. చిరంజీవి ఇప్పటికైనా రీమేక్స్ ఆపేయాలని, ఒరిజినల్ స్టోరీలతో రావాలని అభిమానులు, ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి చేతిలో మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయని టాక్ నడుస్తుంది. ఇప్పుటికే నేడు చిరంజీవి పుట్టిన రోజు కావడంతో భోళా శంకర్ తర్వాత మెగా 156 సినిమా కూతురు సుస్మిత కొణిదెల నిర్మాణంలో గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ లో ఉంటుందని ప్రకటించారు. అయితే ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు అనేది ఇంకా ప్రకటించలేదు.
తాజాగా చిరంజీవి 157వ సినిమాని ప్రకటించారు. చిరంజీవికి బర్త్ డే విషెస్ చెప్తూ ఈ సినిమాని ప్రకటించారు. యువీ క్రియేషన్స్ సంస్థలో మెగా 157 సినిమా ఉండబోతుంది. ఈ సినిమా వసిష్ఠ దర్శకత్వంలో ఉండబోతుంది. కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో మొదటి సినిమానే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న వశిష్ట తన రెండో సినిమాకే చిరంజీవిని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమా సోషియో ఫాంటసీ కథతో ఉండబోతుందని సమాచారం.
తాజాగా మెగా 157 సినిమాని ప్రకటిస్తూ సోషియో ఫాంటసీలా అనిపించే ఓ ఆసక్తికర పోస్టర్ ని రిలీజ్ చేశారు యువీ సంస్థ. దీంతో ఈ సినిమాపై అనౌన్సమెంట్ తోనే అంచనాలు నెలకొన్నాయి ఇందులో చిరంజీవిని మరింత కొత్తగా చూపించబోతున్నట్టు తెలుస్తుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్‌లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!









