ఈ ఏడాది శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు
- August 22, 2023
తిరుమల: తిరుమల శ్రీనివాసుడికి ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈఏడాది అధికమాసం సందర్భంగా సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా సెప్టెంబరు 18న ధ్వజారోహణం, 22న గరుడవాహన సేవ, 23న స్వర్ణరథం, 25న రథోత్సవం(మహారథం), 26న చక్రస్నానం, ధ్వజావరోహణం ఉంటాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా 19న గరుడవాహనం, 22న స్వర్ణరథం, 23న చక్రస్నానం ఉంటాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీవరకు, అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు అష్టదళపాద పద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, సహస్రదీపాలంకార, ఊంజల్ సేవలను టీటీడీ రద్దు చేసింది. ముందస్తుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్లు బుక్ చేసుకున్నవారికి, నిర్దేశిత వాహన సేవలకు మాత్రమే అనుమతిస్తారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్‌లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









