చెస్ ప్రపంచ ఫైనల్ కప్: తొలి గేమ్ ను డ్రా చేసుకున్న ప్రజ్ఞానంద
- August 23, 2023
అజర్‌బైజాన్: ప్రపంచకప్ చెస్ టోర్నీ ఓపెన్ విభాగం టైటిల్ కోసం భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద, వరల్డ్ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే) మధ్య జరిగిన తొలి గేమ్ 'డ్రా'గా ముగిసింది.
తమిళనాడుకు చెందిన 18 ఏళ్ల ప్రజ్ఞానంద ఈ గేమ్‌లో తెల్ల పావులతో ఆడాడు. 35 ఎత్తుల తర్వాత ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇద్దరూ 'డ్రా'కు సమ్మతించారు.
'తొలి గేమ్‌లో నేను ఏ దశలోనూ ఇబ్బంది పడలేదు. రెండో గేమ్‌లో కార్ల్‌సన్‌తో గట్టి పోరాటమే చేయాల్సి ఉంటుంది. అతడిని నిలువరించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తా' అని ప్రజ్ఞానంద వ్యాఖ్యానించాడు. వీరిద్దరి మధ్య నేడు రెండో గేమ్ జరుగుతుంది. ఈ గేమ్‌లో కార్ల్‌సన్ తెల్ల పావులతో ఆడతాడు. ఈ గేమ్‌లో గెలిచిన ప్లేయర్‌కు ప్రపంచకప్ టైటిల్ లభిస్తుంది. ఒకవేళ రెండో గేమ్ కూడా 'డ్రా' అయితే గురువారం టైబ్రేక్ గేమ్‌ల ద్వారా విజేతను నిర్ణయిస్తారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్‌లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









