రియాద్ లో రోడ్ల తనిఖీకి డ్రోన్‌ల వినియోగం

- August 23, 2023 , by Maagulf
రియాద్ లో రోడ్ల తనిఖీకి డ్రోన్‌ల వినియోగం

రియాద్: సౌదీ అరేబియా రోడ్స్ జనరల్ అథారిటీ (RGA) డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి రియాద్‌లోని అనేక రోడ్లను తనిఖీ చేసింది. RGA ఇటీవల రోడ్డు భద్రత, నిర్వహణ స్థాయిని పెంచడానికి దోహదపడే సరికొత్త సాంకేతికతను ఉపయోగించి, రహదారి నెట్‌వర్క్‌ను తనిఖీ చేయడానికి డ్రోన్‌లను ఉపయోగించడం ప్రారంభించింది.  రహదారి వినియోగదారులకు అందించే సేవలను అప్‌గ్రేడ్ చేయాలని రవాణా శాఖ డిప్యూటీ మంత్రి తారెక్ అల్ షామీ సంబంధిత ఏజెన్సీలను ఆదేశించారు. రోడ్ల నిర్వహణ మరియు పరిశుభ్రత స్థాయిని పెంచడానికి పనిని ముమ్మరం చేయాలని  ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com