బ్రిక్స్ లోకి యూఏఈ. హర్హం వ్యక్తం చేసిన షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్

- August 25, 2023 , by Maagulf
బ్రిక్స్ లోకి యూఏఈ. హర్హం వ్యక్తం చేసిన షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్

యూఏఈ: బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా లతో కూడి బ్రిక్స్(BRICS) కూటమికలోకి యూఏఈని ఆహ్వానిండంపై యూఏఈ ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ హర్షం వ్యక్తం చేశారు. "ప్రపంచంలోని అన్ని దేశాలు.. ప్రజల శ్రేయస్సు, గౌరవం మరియు ప్రయోజనం కోసం సహకారం నిరంతర నిబద్ధత కోసం మేము ఎదురుచూస్తున్నాము. ఇది దేశం సమతుల్య విదేశాంగ విధానానికి నిదర్శనం. ప్రపంచ శాంతి, భద్రత మరియు అభివృద్ధికి యూఏఈ నిరంతరం మద్దతుగా నిలుస్తుంది." అని తన ట్విటర్ లో పేర్కొన్నారు. జనవరి 1 నుండి యూఏఈ, సౌదీ అరేబియా, ఈజిప్ట్, అర్జెంటీనా, ఇథియోపియా, ఇరాన్‌లను పూర్తి సభ్యులుగా చేయడానికి గురువారం జరిగిన వార్షిక శిఖరాగ్ర సమావేశంలో కూటమి సభ్యులు అంగీకరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com