బ్రిక్స్ లోకి సౌదీ అరేబియా, యూఏఈ
- August 25, 2023
జోహన్నెస్‌బర్గ్: అభివృద్ధి చెందుతున్న దేశాల ‘బ్రిక్స్’ సమూహంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) చేరనున్నాయి. వచ్చే ఏడాది ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, అర్జెంటీనా కూడా బ్రిక్స్ లో చేరనున్నాయి.ఈ మేరకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా గురువారం జోహన్నెస్‌బర్గ్‌లో గ్రూప్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. కొత్త దేశాల సభ్యత్వం 2024 జనవరి నుండి అమలులోకి వస్తుందని రమాఫోసా చెప్పారు. ప్రస్తుతం ఈ గ్రూపులో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా శాశ్వత దేశాలుగా ఉన్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ బ్రిక్స్ విస్తరణను స్వాగతించారు. కొత్త సభ్యులను చేర్చుకోవడం వల్ల కూటమి బలోపేతం అవుతుందని తమ దేశం ఎప్పటినుంచో విశ్వసిస్తోందని చెప్పారు. బ్రిక్స్ తన మొదటి శిఖరాగ్ర సమావేశాన్ని 2009లో నలుగురు సభ్యులతో నిర్వహించారు. మరుసటి సంవత్సరం దక్షిణాఫ్రికాను చేర్చుకున్నారు. 2015లో బ్రిక్స్ నూతన అభివృద్ధి బ్యాంకును ప్రారంభించింది.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







