బోగస్ జాబ్ ఆఫర్స్‌తో తస్మాత్ జాగ్రత్త
- May 18, 2016
ఏస్టర్ డిఎం హెల్త్ కేర్ అనే కంపెనీలో ఉద్యోగాలున్నాయంటూ ఓ కొందరు ఆన్ లైన్ ద్వారా పెద్ద స్కామ్‌కి తెరలేపిన సంఘటన వెలుగు చూసింది. ఈ విషయం వెలుగు చూడగానే సదరు సంస్థ అప్రమత్తమయ్యింది. తాము ఎలాంటి ఉద్యోగాల్నీ ప్రస్తుతానికి ఆఫర్ చేయడంలేదనీ, ఉద్యోగార్థులు ఎవరూ ఇలాంటి ఆఫర్స్‌ని నమ్మి మోసపోవద్దనీ, ఆ ఉద్యోగ ప్రకటనలతో తాము సంందం లేదని వివరణ ఇచ్చింది. ఇండియా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్, జింబాబ్వే తదితర దేశాల్లోనూ ఏస్టర్ పేరుతో ఆన్‌లైన్ అక్రమాలు జరిగినట్లు తెలియవస్తోంది. ఏస్టర్ హాస్పిటల్, మన్‌ఖూల్, ఏస్టర్ క్లినిక్ మరియు ఏస్టర్ డిఎం హెల్త్‌కేర్‌కి సంబంధించిన ఇతర సంస్థల్లో ఉద్యోగాలున్నాయంటూ కొందరు తమ నుంచి డబ్బు వసూలు చేసి ఆఫర్ లెటర్లు ఇచ్చారనీ, అవి చూసి తాము మోసపోయామని బాధితులు వెల్లడించారు. తమ సంస్థ పత్రికలు, ఇతర అధికారిక ఛానల్స్ ద్వారా మాత్రమే ఉద్యోగాలకు ప్రకటనల విడుదల చేస్తుంది తప్ప, ఇంకే మార్గాల్లోనూ ఉద్యోగాలకు అవకాశం ఇవ్వబోమని సంస్థ ప్రతినిథులు చెప్పారు. అలా ఎవరైనా తమ పేరు చెప్పి డబ్బులు వసూలు చేసిన సందర్భాలుంటే, బాధితులు పోలీసులకు పిర్యాదు చేయాలని కోరారు.
తాజా వార్తలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!









