ఇస్రో మరో కీలక ప్రయోగం..
- August 27, 2023
బెంగుళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) జాబిల్లి దక్షిణ దృవంపై చంద్రయాన్ 3ని విజయంతంగా దించి అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్రను లిఖించింది. అదే ఉత్సహంతో సూర్యుడి రహస్యాలు కనుగొనేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 2వ తేదీన ఆదిత్య – ఎల్1 ప్రయోగం చేపట్టనుంది. ఈ విషయాన్ని ఇస్రో అధికారి ఒకరు వెల్లడించారు. సెప్టెంబర్ 2న ఈ ప్రయోగాన్ని చేపట్టే అవకాశాలు ఉన్నాయని ఇస్రో అధికారులు అంటున్నారు.
ఇప్పటికే ఈ ఉపగ్రహాన్ని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కు తీసుకొచ్చారు. పీఎస్ఎల్వీ సీ 57 రాకెట్
ఆదిత్య – ఎల్ 1ను నింగిలోకి తీసుకెళ్లనుంది. కరోనాగ్రఫీ పరికరం సహాయంతో సౌర వాతావరణంపై పరిశోధనం చేయనున్నారు. కరోనాగ్రఫీ పరికరం సహాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో ఇస్రో సౌర అధ్యయన ప్రక్రియను చేపట్టనుంది.
ఆదిత్య – ఎల్ 1 సూర్యున్ని అధ్యయనం చేసేందుకు చేపడుతున్న తొలి మిషన్. 1500 కిలోల బరువు ఉన్న శాటిలైట్ ఇది. భూమి నుంచి సూర్యుని దిశగా 1.5 కిలో మీటర్ల దూరంలోని లాగ్రాంజ్ పాయింట్ 1 చుట్టూ ఉన్న కక్ష్యలో దీన్ని ప్రవేశ పెట్టనున్నారు. ఈ కక్ష్యలోకి పంపించడం ద్వారా గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యున్ని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలు కలుగుతుంది. ఆదిత్య – ఎల్1 మొత్తం 7 పేలోడ్లను మోసుకెళ్లనుంది.
ఇందులో ప్రధానమైన విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనా గ్రాఫ్ తోపాటు సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్ పెరిమెంట్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, సోలార్ లో ఎనర్జీ ఎక్స్ రే స్పెక్టో మీటర్, హైఎనర్జీ ఎల్-1 ఆర్బిటింగ్ ఎక్స్ రే స్పెక్టో మీటర్, మ్యాగ్నెటోమీటర్ పేలోడ్ లను అమర్చనున్నారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ జెట్లను కుదుర్చుకున్న భారత్
- ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- స్కూల్ పిక్నిక్లో స్టేల్ ఫుడ్.. పేరెంట్స్ ఫైర్..!!
- ప్రైజ్ అవార్డులపై కువైట్ సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం..!!
- ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కింగ్ సల్మాన్..!!
- ఆరాద్లోని మినీ హెరిటేజ్ విలేజ్‌లో అగ్నిప్రమాదం..!!
- వైరల్ ఛాలెంజ్ లపై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- 2026లోనూ ఖతార్ టూరిజం దూకుడు..!!
- కేఏ పాల్‌కు అమెరికాలో అరుదైన గౌరవం..
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..







