కువైట్ లో రెసిడెన్సీ ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం..!
- August 27, 2023
కువైట్: రెసిడెన్సీ ఉల్లంఘనదారులకు ఆశ్రయం కల్పించే వారితో పాటు రెసిడెన్సీ ఉల్లంఘించిన వారినందరినీ బహిష్కరించేందుకు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమగ్ర ప్రణాళికను ప్రారంభిస్తోంది. రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన ప్రవాసుల కోసం నిర్బంధ కేంద్రాలుగా జ్లీబ్ అల్-షుయౌఖ్, ఖైతాన్లలో ప్రస్తుతం ఉపయోగించని రెండు పాఠశాలలను MoI వినియోగించనుంది. రానున్న రోజుల్లో భద్రతా తనిఖీ కార్యకలాపాలను ముమ్మరం చేయనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని సంబంధిత విభాగాల ద్వారా ఉల్లంఘించిన వ్యక్తులపై డేటాను సేకరించి, ఆపై రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన వారిని అదుపులోకి తీసుకోవాలని ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం.రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారిని పట్టుకుని కువైట్ నుండి బహిష్కరించడానికి మంత్రిత్వ శాఖ జ్లీబ్ అల్-షుయౌఖ్, ఖైతాన్, ఫర్వానియా, మహ్బౌలా, అమ్ఘరా, అల్-మజ్రా, మరియు అల్-జవాఖిర్ వంటి ప్రాంతాల్లో భద్రతా గస్తీని పెంచింది. ప్రస్తుతం కువైట్ లో సుమారు 150,000 మంది రెసిడెన్సీ ఉల్లంఘించినట్లు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







