హోమ్ మెడిసెన్గా లవంగాలు.! ఇన్ని ఉపయోగాలా.?
- August 28, 2023లవంగాలతో దాదాపు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎన్నింటినో దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మసాలా కూరల్లో లవంగాలను ఎక్కువగా వాడుతుంటాం. కానీ, రెగ్యులర్గా లవంగాలను ఆహారంలో వుపయోగించే వారికి చాలా రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయని అంటున్నారు.
లవంగాల్లో వుండే పోషకాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీస్ కణాల నష్టాన్ని తగ్గిస్తాయ్. ఇందులో సి విటమిన్ ఎక్కువగా వుంటుంది. లవంగాల్లోని ఫ్లేవనాయిడ్స్, ఫినాలిక్ సమ్మేళనాలు పుష్కలంగా వుండడంతో రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది.
కణాల వాపు, ఆర్ధరైటిస్ వంటి వాటిని నయం చేయడానికి లవంగాలు తోడ్పడతాయ్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆర్ధరైటిస్ని నియంత్రించడానికి లవంగాలు తోడ్పడతాయ్.
అలాగే, పంటి నొప్పికి లవంగాలు చక్కని పరిష్కారం. దీంట్లో వుండే యూసిన్ అనే సమ్మేళనం సహజ నొప్పి నివారిణిగా పని చేస్తుంది.
లవంగాల్లో వుండే యాంటీ మైక్రో బయాల్ గుణాలు జీర్ణాశయంలో అవాంఛిత బ్యాక్టీరియాను తగ్గిస్తాయ్. గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యల్ని కూడా నియంత్రిస్తాయ్.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు