బ్లాక్ హెన్నా వినియోగంపై డెర్మటాలజిస్టుల హెచ్చరిక

- August 29, 2023 , by Maagulf
బ్లాక్ హెన్నా వినియోగంపై డెర్మటాలజిస్టుల హెచ్చరిక

బహ్రెయిన్: బ్లాక్ హెన్నా వినియోగంపై  బహ్రెయిన్ స్పెషలిస్ట్ హాస్పిటల్‌లోని చర్మవ్యాధి నిపుణురాలు డాక్టర్ అనిట్టా సారా థంపి హెచ్చరించారు. చర్మం లేదా తలమీద ఉపయోగించవద్దని సూచించారు. అలెర్జీలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఏదైనా ప్రతికూల లక్షణాలు తలెత్తితే తక్షణ వైద్య సంరక్షణను పొందాలని తెలిపింది. వాటిల్లోని రసాయనాల కూర్పు చర్మ ఆరోగ్యానికి గణనీయమైన ప్రమాదాన్ని కలిగిస్తుందని హెచ్చరించారు. వీటిలో సాధారణంగా PPD అని పిలవబడే పారా-ఫెనిలెన్డియమైన్, బ్లాక్ హెన్నా వల్ల కలిగే ప్రతికూల ప్రతిచర్యకు కారణమైన ప్రధాన పదార్థాలలో ఒకటిగా ఉందని తెలిపారు. ఈ కలరింగ్ ఏజెంట్లు తీవ్రమైన చర్మ సమస్యలకు కారణం అవుతాయి. అలెర్జీ కారణంగా తీవ్రమైన దద్దుర్లు, చర్మ సమస్యలు తలెత్తుతాయని పేర్కొంది. ఇప్పటికే బ్లాక్ హెన్నాను అప్లై చేసి, ఏవైనా ప్రతికూల ప్రతిచర్యలను ఎదుర్కొన్న వారు వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని డాక్టర్ అనిట్టా కోరారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com