అంతరిక్ష సామర్థ్యాన్ని ఒమాన్ తో పంచుకుంటున్న భారత్..!

- August 31, 2023 , by Maagulf
అంతరిక్ష  సామర్థ్యాన్ని ఒమాన్ తో పంచుకుంటున్న భారత్..!

మస్కట్: భారతదేశం  ప్రయోగించిన  ‘చంద్రయాన్-3 విజయవంతం అయింది. ఆగస్టు  23న సాయంత్రం 6:04 (IST)కి చంద్రుని ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ అయ్యి చరిత్ర సృష్టించింది. దీనితో చంద్రుని ఉపరితలంపై అంతరిక్ష నౌకను విజయవంతంగా ల్యాండ్ చేసిన ప్రపంచంలోని 4వ దేశంగా భారతదేశం నిలిచింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన మొదటి  దేశంగా రికార్డ్ సాధించింది. కష్టతరమైన పరిస్థితులను అధిగమించి చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర దిగడం భారతీయ వైజ్ఞానిక సమాజ స్ఫూర్తికి నిదర్శనం. చంద్రయాన్-3 మిషన్ విజయవంతం కావడం వల్ల వచ్చే జ్ఞానాన్ని మానవాళి ప్రయోజనం, పురోగతికి వినియోదించనున్నారు.  ముఖ్యంగా ప్రపంచ దక్షిణాది దేశాలకు ఇది ఎంతో ఉపయుక్తం అని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కీలకమైన అంతరిక్ష ఆధారిత డేటాను అందుబాటులో ఉంచడం ద్వారా దిగువ రంగాల అభివృద్ధికి ఉత్ప్రేరకాన్ని అందించడానికి అంతరిక్ష రంగం సామర్థ్యాన్ని ఉపయోగించుకునే ఉమ్మడి దృష్టిని సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌తో భారతదేశం పంచుకుంటుంది. ఒమాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ బిన్ హమూద్ అల్ బుసాయిదీ సోషల్ మీడియాలో భారత మూన్ మిషన్ విజయవంతమైందని ఒమన్ ప్రభుత్వం,  ఒమన్ సుల్తానేట్ ప్రజల తరఫున అభినందనలు తెలియచేశారు. చంద్రయాన్-3' మిషన్ ప్రారంభానికి కొన్ని వారాల ముందు, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఛైర్మన్ మస్కట్‌లో పర్యటించారు. అంతరిక్ష రంగంలో సహకారంపై ఒమన్ తో చర్చలు జరిపారు. ఆగస్టు 17న, చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్ నుండి ‘విక్రమ్’ ల్యాండర్ విడిపోయినప్పుడు,  బెంగుళూరులోని ఇస్రో సెంటర్‌లో ఈ ల్యాండ్‌మార్క్ ఈవెంట్‌ను చూసేందుకు ఒమన్  రవాణా, కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి హమూద్ అల్ మవాలీ ప్రత్యక్షంగా తిలకించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com