అబ్బో టిల్లుగాని గాళ్ ఫ్రెండ్ మస్త్ బిజీలే.!

- August 31, 2023 , by Maagulf
అబ్బో టిల్లుగాని గాళ్ ఫ్రెండ్ మస్త్ బిజీలే.!

రాధిక పాత్రలో ‘డీజె టిల్లు’లో నేహా శెట్టి చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆ పాత్ర ఆమెకు చాలా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. గుర్తింపుతో పాటూ, బోలెడంత క్రేజ్ కూడా రాబట్టుకుంది.
ఆ క్రేజ్‌తోనే నేహా శెట్టి వరుస ఆఫర్లు అందుకుంటోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఐదారు ప్రాజెక్టులున్నాయ్. బిజీగా వుండడంతో, ‘టిల్లు స్క్వేర్’ ‌లో గెస్ట్ రోల్ కోసం అడిగితే కాదనేంత బిజీ అయిపోయిందట.
అయితే, ఎలాగోలా డైరెక్టర్, హీరో ఒప్పించి ఆ గెస్ట్ రోల్ కోసం తీసుకోవడం జరిగిందట. గెస్ట్ రోలే అయినప్పటికీ కథకు చాలా కీలకమైన పాత్రనీ, మంచి స్కోప్ అండ్ స్పేస్ వున్న పాత్రనీ అంటున్నారు. 
ఈ పాత్ర కోసం ఓ రేంజ్‌లో ముట్టచెప్పారట నిర్మాతలు నేహా శెట్టికి. అన్నట్లు ‘బెదురులంక’ రూపంలో నేహా శెట్టి రీసెంట్‌గా ఓ సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది కూడా. 
అలాగే, త్వరలో రిలీజ్ కాబోయే ‘టిల్లు స్క్వేర్’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ తదితర సినిమాలు నేహా శెట్టి కెరీర్‌ని స్టార్‌డమ్ దిశగా దూసుకెళ్లేలా చేస్తాయేమో చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com