నకిలీ వాట్సాప్ మెస్సేజుల స్కామర్‌లు అరెస్ట్
- September 01, 2023
యూఏఈ: ఫిషింగ్, ఫోన్ స్కామ్‌లకు పాల్పడుతూ నివాసితుల బ్యాంకు ఖాతాల నుండి భారీ మొత్తంలో డబ్బును దొంగిలిస్తున్న మోసగాళ్ల ముఠాను రస్ అల్ ఖైమా పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ స్కామ్‌కు సంబంధించి దేశం లోపల మరియు వెలుపల ఉన్న ఏడుగురు ఆసియన్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా బ్యాంకు ప్రతినిధులుగా నటిస్తూ ఫోన్ కాల్స్ లేదా ఫేక్ వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా నివాసితులను సంప్రదిస్తుందని పోలీసులు తెలిపారు. అప్పుడు, డేటా అందించకపోతే వారి ఖాతాలు బ్లాక్ చేయబడతాయని చెప్పడం ద్వారా వారు బ్యాంకు వివరాలను తెలుసుకుంటున్నారని రస్ అల్ ఖైమా పోలీస్‌లో తాత్కాలిక డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆపరేషన్స్, బ్రిగ్-జనరల్ తారిఖ్ ముహమ్మద్ బిన్ సైఫ్ తెలిపారు. షార్జా పోలీసుల సహకారంతో స్కామర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. స్కామర్ల నుంచి "పెద్ద సంఖ్యలో బ్యాంకు కార్డులను" కూడా జప్తు చేసినట్లు చెప్పారు. గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్, మెసేజ్‌లకు స్పందించవద్దని కోరారు.
తాజా వార్తలు
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్‌లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్







