రైల్వే బోర్డుకు తొలి మహిళా సీఈవో జయవర్మ సిన్హా
- September 01, 2023
న్యూ ఢిల్లీ: రైల్వేబోర్డు ఛైర్మన్ గా తొలిసారి మహిళకు అవకాశం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వేబోర్డు ఛైర్ పర్సన్ గా జయవర్మ సిన్హా ను నియమిస్తూ ఉత్వర్వులు జారీచేసింది. IRMS అధికారి జయవర్మ సిన్హా సుమారు 3వందల మృతి చెందిన బాలేశ్వర్ రైల్వే దుర్ఘటనకు సంబంధించి క్లిష్టమైన సిగ్నలింగ్ వ్యవస్థపై వివరించారు. సెప్టెంబర్ 1 నుంచి 2024 ఆగస్టు 31వ తేదీ వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు జయవర్మ సీఈవోగా కొనసాగనున్నారు. రైల్వే బోర్డు సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న తొలి మహిళా అధికారి జయవర్మనే కావడం విశేషం. నేటి వరకు రైల్వే బోర్డు సీఈవోగా అనిల్ కుమార్ లహాటీ కొనసాగారు.
అలహాబాద్ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి అయిన జయావర్మ 1988లో ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్‌లో చేరారు. ఉత్తర, ఆగ్నేయ, తూర్పు రైల్వే జోన్లలో ఆయా హోదాల్లో విధులు నిర్వహించారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని భారత హైకమిషన్‌లో రైల్వే సలహాదారుగా నాలుగేళ్లపాటు పనిచేశారు. ఆ సమయంలోనే కోల్‌కతా నుంచి ఢాకాకు ‘మైత్రీ ఎక్స్‌ప్రెస్’ ప్రారంభమైంది. జూన్‌లో ఒడిశాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదానికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని వివరించడం ద్వారా జయావర్మ మీడియాలో నిలిచారు. వాస్తవానికి ఆమె అక్టోబర్ 1న పదవీ విరమణ చేయనున్నారు. అయితే, ఆమె పదవీ కాలం ముగిసే వరకు అదే రోజు తిరిగి ఉద్యోగంలో చేరనున్నారు.
తాజా వార్తలు
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్‌లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్







