సినిమా రివ్యూ: ‘ఖుషి’

- September 01, 2023 , by Maagulf
సినిమా రివ్యూ: ‘ఖుషి’

నటీనటులు: విజయ్ దేవరకొండ, సమంత, సచిన్ ఖేడ్కర్, తదితరులు జయరామ్, మురళీ శర్మ, లక్ష్మి, రోహిణి తదితరులు
సంగీతం: హెషమ్ అబ్ధుల్ వహాబ్
డైరెక్టర్: శివ నిర్వాణ
నిర్మాణం: మైత్రీ మూవీస్ మేకర్స్
సినిమాటోగ్రఫీ: మురళి.జి

‘లైగర్’ డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ నుంచి వస్తున్న సినిమా ‘ఖుషి’. మొదట్లో పెద్దగా అంచనాల్లేకపోయినప్పటికీ ప్రమోషన్లతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. పోస్టర్లూ, పాటలు ఇప్పటికే బాగా ఆకట్టుకున్నాయ్. మరి ‘ఖుషి’తో విజయ్ దేవరకొండ అంచనాల్ని అందుకుంటాడా.? డ్యామేజ్ అయిపోయిన ఇమేజ్‌ని తిరిగి తెచ్చుకుంటాడా.? తెలియాలంటే ‘ఖుషి’ కథలోకి వెళ్లాల్సిందే.!

కథ:
విప్లవ్ దేవరకొండ (విజయ్ దేవరకొండ), ఆరాధ్య (సమంత)ను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. మొదట ఆరాధ్య వ్యతిరేకించినా ఆ తర్వాత విప్లవ్‌ని ప్రేమిస్తుంది. అయితే, వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులూ ఒప్పుకోరు. దాంతో పెద్దల్ని ఎదిరించి విప్లవ్, ఆరాధ్య పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తర్వాత వీరి జీవితం సాఫీగా సాగిందా.? మధ్యలో ప్రవచన కర్త చదరంగం శ్రీనివాసరావు (మురళీ శర్మ) లొల్లి ఏంటీ.? నాస్తికుడైన విప్లవ్ తండ్రి సత్యం (సచిన్ ఖేడ్కర్) ద్వారా ఈ ప్రేమ జంట ఎధుర్కొన్న పరిణామాలేంటీ.? తెలియాలంటే ‘ఖుషి’ ధియేటర్‌లో చూడాల్సిందే.

నటీనటుల పని తీరు:
లవర్ బోయ్‌లా, భర్తగా రెండు పాత్రల్లోనూ విజయ్ దేవరకొండ బాగున్నాడు. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. పెళ్లి తర్వాత ఓ సగటు భర్త ఎలాంటి ఫీలింగ్స్ అయితే కలిగి వుంటాడో వాటిని తెరపై క్యాచీగా చూపించాడు విప్లవ్ పాత్ర ద్వారా. కొన్ని సీన్లలో విజయ్ నటన హైలైట్ అని చెప్పొచ్చేమో. ఆ రేంజ్‌లో పర్‌ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు విజయ్. ఇక, సమంత ఆరాధ్య పాత్రలో ఒదిగిపోయింది. బేగంలా ఆరాధ్యలా బెస్ట్ స్ర్కీన్ ప్రెజెన్స్ ఇచ్చింది. సచిన్ ఖేడ్కర్, మురళీ శర్మ తమదైన నేచురల్ యాక్టింగ్‌తో స్ర్కీన్‌‌కి హుందాతనం తీసుకొచ్చారు. రోహిణి, లక్ష్మి పాత్రలు తమ సీనియారిటీని రంగరించి మెప్పించాయ్. వెన్నెల కిషోర్ ఎప్పటిలాగే తనదైన కామెడీతో ఆకట్టుకున్నాడు. మిగిలిన పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పని తీరు:
సింపుల్ స్టోరీ. కథలో కొత్తదనమేమీ లేదు. నాస్తికత్వానికీ, భక్తికీ మధ్య జరిగే డ్రామా. గతంలోనూ చాలా సినిమాల్లో ఈ కాన్సెప్ట్ చూసేశాం. కానీ, కథనం నడిపించడంలో శివ నిర్వాణ మంచి మార్కులేయించుకున్నాడు. ఓ సాధారణ లవ్ స్టోరీలో ఆయన చొప్పించిన సెంటిమెంట్, ఎమోషన్.. ప్రేక్షకుడి హృదయానికి హత్తుకుంటాయ్. అలా ‘ఖుషి’ని ఎంజాయ్ చేయడానికి ఆస్కారముంటుంది. ఫక్తు కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని జోడిస్తూనే, కథకి కావల్సిన ఎమోషన్ కూడా క్యారీ చేశాడు. అబ్ధుల్ వహాద్ మ్యూజిక్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్. కొన్ని సీన్లలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేశాడు. నిర్మాణ విలువలు బాగున్నాయ్. సినిమాటోగ్రఫీ బాగుంది. కశ్మీర్ లొకేషన్లు వావ్ అనిపిస్తాయ్. ఎడిటింగ్‌కి ఇంకాస్త పదును పెట్టి వుంటే, బాగుండేది. 

ప్లస్ పాయింట్స్..
కాన్సెప్ట్, ఫీల్ గుడ్ ఎమోషన్, ఫస్టాప్, మ్యూజిక్, విజయ్ దేవర కొండ పర్‌ఫామెన్స్, సమంత, విజయ్ మధ్య కెమిస్ర్టీ,

మైనస్ పాయింట్స్:..
సెకండాఫ్‌లో సాగతీత సీన్లు, స్లోగా నడిచిన స్క్రీన్ ప్లే, కొన్ని రొటీన్ సీన్స్ లేపేస్తే ఇంకా బాగుండేది.

చివరిగా:
‘ఖుషి’ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా.! ఆడియన్స్‌కి కనెక్ట్ అవ్వడానికి అవకాశాలు బాగానే వున్నాయ్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com