మొత్తానికి ఆ ముద్ర చెరిపేసుకున్నాడు విజయ్.!
- September 04, 2023
‘ఖుషి’ సినిమాతో ఓ మోస్తరు హిట్ అయితే కొట్టేశాడు విజయ్ దేవరకొండ. ‘లైగర్’తో ఇచ్చిన డిజప్పాయింట్మెంట్ ‘ఖుషి’తో ఒకింతైనా తీర్చేసుకున్నట్లే. అయితే, ‘ఖుషి’ సక్సెస్ అనిపించడానికి విజయ్ చాలానే కష్టపడ్డాడట.
పీ ఆర్ టీమ్స్‌ని తనదైన స్టైల్లో మ్యానేజ్ చేసేందుకు బోలెడంత ఖర్చు చేశాడట. మొత్తానికి సినిమా రిలీజ్‌కి ముందే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం.. రిలీజ్ తర్వాత ఆ టాక్ కంటిన్యూ చేయడంతో, ఓపెనింగ్స్ బాగానే రాబట్టింది. వీకెండ్ కలెక్షన్లు కూడా బాగున్నాయ్.
ఇక, సోమవారం కూడా ధియేటర్లకు జనాన్ని రప్పించగలిగితే, విజయ్ దేవరకొండ సక్సెస్ అయినట్లే. ఏది ఏమైతేనేం, ‘ఖుషి’ ఇటు విజయ్ దేవరకొండకీ, అటు సమంతకీ ఇద్దరికీ కూడా మంచి బౌన్స్ బ్యాక్ ఇచ్చిందనే చెప్పోచ్చేమో.
ఇక, విజయ్ తదుపరి సినిమాలకు సంబంధించి ఇది మంచి సూచనే అని చెప్పొచ్చు.‘ఖుషి’ ఇచ్చిన ఉత్సాహంతో, రెట్టించిన ఉత్సాహంతో పని చేయబోతున్నాడట విజయ్. అదీ సంగతి.
తాజా వార్తలు
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్







