నగదు లేదా తనఖాపై ఆస్తి కొనుగోలు. ఏదీ ఉత్తమం?

- September 04, 2023 , by Maagulf
నగదు లేదా తనఖాపై ఆస్తి కొనుగోలు. ఏదీ ఉత్తమం?

యూఏఈ: యూఏఈలో క్రమంగా జనాభా పెరుగుతుంది. యువ నిపుణులు రావడం ఇటీవల ఎక్కువైంది. అదే సమయంలో ఎక్కువ కాలం ఎమిరేట్స్ లో స్థిరపడాలనే లక్ష్యంతో ఆస్తుల కొనుగోలు ధరలు పెరుగుతున్నాయి. పెరుగుతున్న అద్దెలు ఆదా చేయడానికి, ఆస్తిని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.  ఇందు కోసం క్యాష్, తనఖా పద్ధతుల్లో ఆస్తులను కొనేందుకు ఏదీ ఉత్తమ పద్ధతి అన్న అనుమానం ఉంటుంది. మార్ట్‌గేజ్ ఫైండర్ ప్రకారం.. మార్టిగేజ్ బైయింగ్ వాల్యూమ్ ఈ ఏడాది 24 శాతం పెరిగింది.  తనఖా ద్వారా కొనుగోళ్లు ఆస్తి లావాదేవీలలో 38 శాతం వాటా ఉంది.

తనఖా రేటు ఎంత?

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యూఏఈ, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుదలకు అనుగుణంగా తనఖా రేట్లు గత రెండేళ్లలో పెరుగుతున్నాయి. చాలా స్థానిక బ్యాంకులకు ప్రస్తుతం రేట్లు 4.24 శాతం నుండి 4.99 శాతం వరకు ఉన్నాయి. 

డిమాండ్ పెరుగుతోంది

దుబాయ్‌కి చెందిన మార్ట్‌గేజ్ ఫైండర్ మాట్లాడుతూ.. ప్రత్యేకించి పెరుగుతున్న ప్రవాసుల సంఖ్యతో ప్రజలు తనఖాతో ఆస్తులను కొనుగోలు చేయడంలో పెరుగుదల ఉంటుందని తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో ఎక్కువ మంది యువ కొనుగోలుదారులు తమ కొనుగోళ్లకు నిధులు సమకూర్చేందుకు తనఖాల కోసం వెళ్లే అవకాశం ఉందన్నారు.

నగదు లేదా తనఖా?

యూఏఈలో ఆస్తి కొనుగోలుదారుల కోసం నగదు మరియు తనఖా గురించి నిర్ణయం తీసుకునేటప్పుడు మార్కెట్ పరిస్థితులను పరిశీలించారు. చాలా మంది తమ పొదుపు మొత్తాన్ని ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడరు. బదులుగా తమ వద్ద ఉన్న నగదులో కొంత భాగాన్ని మాత్రమే పెట్టేందుకు ఇష్టపడతారు. తనఖా కోసం వెళ్లడం ప్రయోజనకరమని అనేక మంది భావిస్తున్నట్లు గణంకాలు చెబుతున్నాయి.  అయితే, వచ్చే ఏడాది నుంచి అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందువల్ల యూఏఈలో కూడా తనఖా రేట్లు తగ్గే అవకాశం ఉంది. అందువల్ల, తనఖాల కోసం వెతుకుతున్న ప్రాపర్టీ కొనుగోలుదారులు పెరిగే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com