గ్లోబల్ వాటర్ ఆర్గనైజేషన్ ఏర్పాటును ప్రకటించిన క్రౌన్ ప్రిన్స్

- September 05, 2023 , by Maagulf
గ్లోబల్ వాటర్ ఆర్గనైజేషన్ ఏర్పాటును ప్రకటించిన క్రౌన్ ప్రిన్స్

జెడ్డా: ప్రపంచవ్యాప్తంగా నీటివనరులను సంరక్షిడంలో ప్రభుత్వాలు, సంస్థలు చేపడుతున్న ప్రయత్నాలను ఏకీకృతం చేయడానికి,  మెరుగుపరచడానికి సౌదీ అరేబియా గ్లోబల్ వాటర్ ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు క్రౌన్ ప్రిన్స్,  ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ సోమవారం ప్రకటించారు. రియాద్‌లో ప్రధాన కార్యాలయంలో ఈ సంస్థను ఏర్పాటు చేయనున్నారు. ఈ సంస్థ నైపుణ్యం, అధునాతన సాంకేతికత, ఆవిష్కరణలను ప్రోత్సహించడం మరియు పరిశోధన, అభివృద్ధి అనుభవాలను ప్రపంచదేశాలు, సంస్థలతో పంచుకోనుంది.    2050 నాటికి ప్రపంచ జనాభా 9.8 బిలియన్లకు చేరుతుందని, నాటికి ప్రపంచ నీటి డిమాండ్ రెట్టింపు అవుతుందన్న అంచనాలతో ఇటువంటి సహకారం అత్యవసరమైనదని ఈ సందర్భంగా క్రౌన్ ప్రిన్స్ వెల్లడించారు. ఈ చొరవ అన్ని సభ్య దేశాలతో, నీటి భద్రత-సంబంధిత స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో దోహదపడుతుందన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com