మొలకెత్తిన గింజలకు అంత శక్తి వుందా.?
- September 05, 2023స్ప్రౌట్స్.. లేదా మొలకెత్తిన గింజలతో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలున్నాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ప్రతీ రోజూ ఓ గుప్పుడు మొలకెత్తిన గింజల్ని తింటే ఎంతో ఆరోగ్యంగా వుంటామని నిపుణులు చెబుతున్నారు.
మొలకెత్తిన గింజలు అంటే, పెసలు, మినుములు, శనగలు.. ఇలా ఏవైనా తీసుకోవచ్చు. ముఖ్యంగా మొలకెత్తిన పెసలు ఆరోగ్యానికి అత్యంత మేలు చేస్తాయని అంటున్నారు.
దీంట్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ. సో, మలబద్ధకం వంటి సమస్యలుంటే నయం అవుతాయ్. అలాగే, నులి పురుగుల సమస్య కూడా తగ్గుతుంది రెగ్యులర్గా మొలకెత్తిని పెసలు తినడం వల్ల.
అన్నింటికీ మించి తాజా అధ్యయనాల్లో వెల్లడైన విషయమేంటంటే, క్యాన్సర్ వ్యాధి రాకుండా వుండేందుకు మొలకెత్తిన పెసలు మంచి ఔషధంగా పని చేస్తున్నాయని సర్వేలో తేలింది.
అలాగే, మొలకెత్తిన గింజలు తినడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. తద్వారా షుగర్ వ్యాధి కంట్రోల్లో వుంటుంది. అధిక బరువు సమస్య వున్నవాళ్లు డైటింగ్ పేరు చెప్పి తిండి మానేయాల్సిన పని లేదు. దానికి బదులు ఓ చిన్న గిన్నెడు మొలకెత్తిన పెసలు తింటే కొవ్వు కరిగడంతో పాటూ, శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్