విజయ్ దేవరకొండ నిజంగా బంగారు కొండే.!
- September 05, 2023
‘అర్జున్ రెడ్డి’ సినిమాతో సెన్సేషనల్ స్టార్ అనిపించుకున్నాడు విజయ్ దేవరకొండ. తనదైన ఆటిట్యూడ్‌తో యూత్‌లో ప్రత్యేకమైన స్థానం దక్కించుకున్నాడు.
అయితే, విజయ్ దేవరకొండ అంటే కేవలం ఆటిట్యూడ్ మాత్రమే కాదు, అతనిలో ఓ మంచి మనిషి దాగున్నాడు. కష్టం అనిపిస్తే, క్షణాల్లో స్పందించగల దయా హృదయం ఆయనలో వుంది. కేరళ వరదల సమయంలో మొట్టమొదటగా స్పందించి తనవంతు సాయమందించాడు విజయ్ దేవరకొండ.
అలాగే, కరోనా కష్టకాలంలోనూ తనదైన శైలిలో సాయమందించాడు. కేవలం రీల్ హీరోగానే కాకుండా, రియల్ హీరోగానూ ఇలాంటి క్వాలిటీస్ ఎన్నో వున్నాయ్ విజయ్ దేవరకొండలో.
‘లైగర్’ సినిమాతో కెరీర్ పరంగా కాస్త డీలా పడ్డాడు కానీ, తాజాగా ‘ఖుషి’ సినిమాతో మళ్లీ పుంజుకున్నాడు విజయ్. ‘ఖుషి’ విజయాన్ని తానొక్కడే ఎంజాయ్ చేయకుండా, ఇన్నోవేటివ్‌గా తన ఆనందాన్ని పంచుకుంటున్నాడు.
ఒక కోటి రూపాయల మొత్తాన్ని, పేద ప్రజలకు పంచివ్వాలనుకుంటున్నాడు. సెలెక్టివ్‌గా 100 కుటుంబాల్ని ఎంచుకుని ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున పంచిచ్చేందుకు రెడీ అవుతున్నాడట. కేవలం పబ్లిసిటీ కోసమే కాదంటున్నాడు. ఇలా పంచుకోవడం ద్వారానే అసలు సిసలు ఖుషి వస్తుందని అంటున్నాడు బంగారు కొండ విజయ్ దేవరకొండ.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..