‘హిరణ్యకశ్యప’ ప్రాజెక్ట్‌ని స్పీడ్ అప్ చేసిన రానా.!

- September 05, 2023 , by Maagulf
‘హిరణ్యకశ్యప’ ప్రాజెక్ట్‌ని స్పీడ్ అప్ చేసిన రానా.!

అప్పుడుప్పుడో రానా హీరోగా ‘హిరణ్య కశ్యప’ ప్రాజెక్టును ప్రకటించారు ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్. అయితే, ఆ తర్వాత గుణ శేఖర్ నుంచి వచ్చిన సినిమాలు ఫ్లాప్ అవుతూ వచ్చాయ్. అందులో ‘శాకుంతలం’ కూడా ఒకటి.
రానా కూడా తర్వాత పలు సినిమాల్లో నటించారు. అయితే, ‘హిరణ్యకశ్యప’ ప్రాజెక్ట్ మాత్రం అనౌన్స్‌మెంట్ దగ్గరే ఆగిపోయింది. అయితే, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ముందుకు కదిలినట్లు తెలుస్తోంది.
కానీ, చిన్న కిరికిరి. డైరెక్టర్‌ని మార్చేస్తున్నారట. గుణశేఖర్ ప్లేస్‌లో మరో డైరెక్టర్‌ని తీసుకోవాలనుకుంటున్నారట నిర్మాత సురేష్. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లోనే ఈ సినిమా రూపొందుతోంది.
ఇప్పటికే ఈ సినిమా స్ర్కిప్టు త్రివిక్రమ్ చేతికి వచ్చినట్లు ప్రచారం. అయితే, కేవలం స్ర్కిప్టు పనులు మాత్రమే త్రివిక్రమ్ చూసుకుంటున్నారట. డైరెక్టర్ ఎవరన్నది ఇంకా తేలాల్సి వుంది. ఓ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్‌ని ఈ సినిమా కోసం ఎంచుకునేందుకు చూస్తున్నారట. 
త్రివిక్రమ్ సలహాలూ, సూచనలతో ఆ డైరెక్టర్ ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారనీ, త్వరలోనే అందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com