మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్‌బాబు చిత్రం మరికొద్ది రోజుల్లో..
- May 19, 2016
మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్‌బాబు కథానాయకుడుగా రూపుదిద్దుకోనున్న చిత్రం షూటింగ్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. 'బ్రహ్మోత్సవం' విడుదల తరువాత 15 రోజుల విరామం తీసుకుని ఈ చిత్రం షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు మహేశ్ ఇటీవల ఓ ఇంటర్వూలో పేర్కొన్నారు. 'మురుగదాస్ నా అభిమాన దర్శకుడు. 'గజిని' నుంచే ఆయనతో ఓ సినిమా చేయాలని ఎదురుచూస్తున్నా. నా 'ఒక్కడు' సినిమా అంటే ఆయనకు చాలా ఇష్టం. 'శ్రీమంతుడు' ప్రచారంలో భాగంగా ఓ సారి చెన్నై వెళ్లా. అప్పుడు మురుగదాస్‌ని కలిశా. ఆయన ఓ లైన్ చెప్పారు. చాలా బాగా నచ్చింది. ఎన్వీ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తారు. 'బ్రహ్మోత్సవం' తరువాత 15 రోజులు విశ్రాంతి తీసుకుని చిత్రీకరణ మొదలెడతాం' అని మహేశ్ తెలిపారు. ఈ చిత్రంలో కథానాయికగా బాలీవుడ్ నటి పరిణీతీ చోప్రాను అనుకుంటున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!







