‘డీఓహెచ్’లోప్యాసింజర్ డిజిటల్ అసిస్టెన్స్ కియోస్క్‌లు ప్రారంభం
- September 06, 2023
దోహా: ప్రయాణికులకు ప్రయాణ అనుభవాన్ని పెంపొందించే లక్ష్యంతో ప్యాసింజర్ డిజిటల్ అసిస్టెన్స్ కియోస్క్‌లను హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (DOH) ప్రారంభించింది. ఇందుకోసం అటోస్ మరియు రాయల్ షిపోల్ గ్రూప్‌తో పనిచేయనుంది. ఈ కియోస్క్‌లు సమాచారానికి అనుకూలమైన యాక్సెస్‌ని అందించడానికి, నావిగేషన్‌లో సహాయం చేయడానికి.. కస్టమర్ సర్వీస్ ఏజెంట్లకు ప్రత్యక్ష వీడియో కాల్‌లను అందించడానికి, ప్రయాణికులకు సాఫీగా ప్రయాణాలను అందించడానికి రూపొందించబడ్డాయని హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ సుహైల్ కద్రి తెలిపారు. కియోస్క్‌లు 20 భాషాల్లో పనిచేయనున్నాయని, విమానాశ్రయ మ్యాప్‌తో పాటు విమానాలు, విమానాశ్రయ సేవలు, రిటైల్ మరియు F&B అవుట్లెట్లు , విమానాశ్రయంలో ప్రయాణీకుల ఈవెంట్లకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్‌లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!









