సౌదీ ఆర్థిక సంస్కరణలపై IMF ప్రశంసలు..!
- September 07, 2023
రియాద్: సౌదీ అరేబియా సంస్కరణ కార్యక్రమాలపై అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ప్రశంసలు కురిపించింది. సౌదీ అరేబియా ప్రస్తుతం బలమైన ఆర్థిక వృద్ధిని నమోదు చేస్తోందని, బలమైన ఆర్థిక స్థితిలో ఉందని, ప్రతిష్టాత్మకమైన సౌదీ విజన్ 2030 సంస్కరణ ఎజెండాను అమలు చేయడంలో చెప్పుకోదగ్గ పురోగతిని సాధిస్తుందని ఐఎమ్ఎఫ్ తన నివేదికలో పేర్కొంది. సౌదీ అరేబియా 2022లో వేగంగా అభివృద్ధి చెందుతున్న G20 ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ప్రశంసించబడింది. ఇది 8.7% వృద్ధి రేటును నమోదు చేసింది. చమురుయేతర GDP కూడా దాదాపు 4.8% కి చేరింది. సౌదీ పౌరులలో నిరుద్యోగం చారిత్రాత్మకంగా కేవలం 8%కి చేరుకుందని పేర్కొంది. సౌదీ విజన్ 2030 ద్వారా నిర్దేశించబడిన 2030 లక్ష్యమైన 30%ని అధిగమించి, లేబర్ మార్కెట్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంలో సౌదీ అరేబియా చెప్పుకోదగ్గ పురోగతిని సాధించింది. మహిళలు లేబర్ మార్కెట్ లో 37% నికి చేరుకున్నారు. ఈ తాజా IMF నివేదిక సౌదీ అరేబియాతో 2023 ఆర్టికల్ IV సంప్రదింపుల ముగింపు తర్వాత జారీ చేసింది.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









