ఖతార్ జలాల్లో 50కి పైగా షార్క్ ల సంచారం
- September 07, 2023
దోహా: ఇటీవల ఖతార్ జలాల్లో వివిధ జాతులకు చెందిన 50కి పైగా షార్క్ లు కనిపించాయి. అధికారుల ప్రకారం.. ఇది అతిపెద్ద షార్క్ సముహంగా చెబుతున్నారు. IUCN రెడ్ లిస్ట్ ప్రకారం, ఈ సమావేశంలో అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న మూడు జాతులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఖతార్‌లోని ఉత్తర సముద్ర ప్రాంతాలకు క్షేత్ర పర్యటన సందర్భంగా పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖలోని రక్షణ మరియు సహజ నిల్వల విభాగానికి చెందిన పరిశోధనా బృందం వీటిని గుర్తించింది. షార్క్ వీడియోను మంత్రిత్వ శాఖ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. "దేశంలో ఈ వైవిధ్యమైన షార్క్ ల జీవ వైవిధ్యాన్ని సంరక్షించడానికి.. అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జాతులను రక్షించడానికి మంత్రిత్వ శాఖ చేసిన గొప్ప ప్రయత్నాలు ఫలితం ఇచ్చింది. " అని మంత్రిత్వ శాఖ తన పోస్టులో పేర్కొంది. కనిపించిన షార్క్ సముహంలో "కామన్ బ్లాక్‌టిప్ షార్క్స్ (కార్చర్హినస్ లింబటస్), గ్రేస్‌ఫుల్ షార్క్స్ (కార్చర్హినస్ ఆంబ్లిరిన్కోయిడ్స్), స్పిన్నర్ షార్క్స్ (కార్చార్హినస్ బ్రేవిపిన్నా) వంటి అరుదైన షార్క్ జాతులు ఉన్నాయని పర్యావరణ పరిరక్షణ సంస్థ ప్రాంతీయ వేల్ షార్క్ కన్జర్వేషన్ సెంటర్ (RWSCC) వెల్లడించింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం
- 40 మంది సభ్యులతో గవర్నర్‌ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లు ఇక టెక్ట్స్‌లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్‌లో వాహనాలు స్వాధీనం..!!







