కుర్రోడు బాగా కష్టపడుతున్నాడు కానీ.!
- September 07, 2023
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో ‘జాతిరత్నాలు’ ఫేమ్ నవీన్ పోలిశెట్టి ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాతో అనుష్క రీ ఎంట్రీ ఇస్తుండడం విశేషం.
ప్రమోషన్ చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచేలానే వున్నాయ్. అలాగే, నవీన్ పోలిశెట్టి చేస్తున్న ఇన్నోవేటివ్ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఆకట్టుకుంటున్నాయ్.
ఈ సినిమాకి యూఎస్‌లోనూ మంచి బజ్ నడుస్తోంది. అక్కడ కూడా మనోడు గట్టిగానే ప్రమోషన్లు ప్లాన్ చేశాడు. అయితే, అనుష్క మాత్రం ఎక్కడా ప్రమోషన్లలో పాల్గొనలేదింతవరకూ.
ఈ సినిమాలో అనుష్కను చూసిన అభిమానుందరూ ఖుషి అవుతున్నారు. ప్రమోషన్లలో భాగంగా, అనుష్క కనిపిస్తే తమకు తోచిన ప్రశ్నలు అడిగేద్దామని విలేఖర్లు కూడా రెడీగా వున్నారు.
అయితే, అనుష్క మాత్రం అందుకు అవకాశమే ఇవ్వలేదు. ప్రమోషన్లలో ఎక్కడా కనిపించలేదు. నవీన్ పోలిశెట్టి సోలోగానే సినిమాని తన రేంజ్లో తెగ ప్రమోట్ చేస్తున్నాడు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్‌లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







