‘ఆది కేశవ’.! అలా అనుకుంటున్నారా.?
- September 07, 2023
రీసెంట్‌గా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన సినిమాలన్నీ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ మెగా మూవీస్ రిలీజయ్యాయ్. ‘బ్రో’ ఓ మోస్తరు టాక్ తెచ్చుకున్నప్పటికీ, ‘భోళా శంకర్’ బాగా నిరాశపరిచింది.
ఆ తర్వాత వచ్చిన ‘గాంఢీవధారి అర్జున’ కూడా ఫెయిలైంది. ఇక, ఇప్పుడు వైష్ణవ్ తేజ్ వంతు. ‘ఆది కేశవ’ సినిమాతో వైష్ణవ్ తేజ్ రాబోతున్నాడు.
తొలి సినిమా ‘ఉప్పెన’ తప్ప వైష్ణవ్ తేజ్ కెరీర్‌లో ఇంతవరకూ సరైన హిట్టు పడలేదు. ‘ఆది కేశవ’పై అంచనాలున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా రిలీజ్ కాస్త రిస్కేమో అనుకుంటున్నారట.
మేకర్లయితే, కథపై సినిమా అవుట్ పుట్‌పై చాలా నమ్మకంతో వున్నారట. అందులోనూ శ్రీలీల హీరోయిన్ అన్న విషయం ఈ సినిమాకి ఇంకో ప్లస్ పాయింట్. చూడాలి మరి, ఏం జరుగుతుందో.!
ప్రమోషన్లయితే హాఫ్ హార్టెట్‌గానే స్టార్ట్ చేశారు. కానీ, రిలీజ్ అయ్యేంతవరకూ గ్యారంటీ లేదని ఇన్‌సైడ్ వర్గాల సమాచారమ్.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్‌ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







