సామాజిక కార్యకర్తల సహాయంతో స్వదేశానికి ఇండియన్ టూరిస్ట్

- September 08, 2023 , by Maagulf
సామాజిక కార్యకర్తల సహాయంతో స్వదేశానికి ఇండియన్ టూరిస్ట్

యూఏఈ: పత్రాలు లేకుండా చాలా నెలలుగా యూఏఈలో చిక్కుకుపోయిన భారతీయ జాతీయుడిని స్థానిక సామాజిక కార్యకర్తల సహాయంతో స్వదేశానికి తిరిగివెళ్లాడు. వివరాల్లోకి వెళితే..ముహ్సిన్ దక్షిణ భారత రాష్ట్రం కేరళలోని త్రిసూర్ జిల్లాకు చెందినవాడు. 49 ఏళ్ల అతను మార్చి 2023లో విజిట్ వీసాపై యూఏఈకి వచ్చాడు. వెంటనే, అతను తన పాస్‌పోర్ట్ మరియు ఇతర పత్రాలతో కూడిన బ్యాగ్‌ను పోగొట్టుకున్నాడు. దీంతో భారతదేశానికి తిరిగి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. అదే సమయంలో వీసా స్టేటస్ ను మార్చుకోనందున ఓవర్‌స్టే జరిమానాలు భారీగా పెరిగాయి. అద్దె చెల్లించలేక పార్కులో ఉంటున్నాడు. అతన్ని ఒక పార్కులో గుర్తించిన సామాజిక కార్యకర్తలు విషయాలను అడిగి తెలుసుకొని సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. యాబ్ లీగల్ సర్వీసెస్ సీఈఓ సలాం పప్పినిస్సేరి, సామాజిక కార్యకర్తలు సియాఫ్ మట్టంచెరి, రహీమా షనీద్ లు చొరవ తీసుకొని కేరళ ముస్లిం కల్చరల్ సెంటర్ (KMCC) నుండి దుబాయ్, షార్జా, అజ్మాన్ కార్మికులు అతనికి సహాయానికి కలిసి వచ్చారు. అతని ఓవర్‌స్టే జరిమానాలను మాఫీ చేయించడంతోపాటు దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ నుండి పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్, అవుట్‌పాస్ వచ్చేలా కృషి చేశారు. దీంతో అల్ అవీర్ దేశం నుండి నిష్క్రమించడానికి మార్గం క్లియర్ అయింది. ఇటీవల కేరళకు తిరిగి వెళ్లిన ముహ్సిన్‌కు సామాజిక కార్యకర్తలు విమాన టిక్కెట్‌ను కూడా కొనిచ్చారు. యఏఈ ఇటీవలే ఓవర్‌స్టేయింగ్ జరిమానాలను ప్రామాణికం చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, విజిట్, టూరిస్ట్ మరియు రెసిడెన్స్ వీసా ఓవర్ స్టేయింగ్ ఫీజులు రోజుకు 50 దిర్హామ్‌లుగా నిర్ణయించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com