బిగ్‌బాస్ స్టేజ్‌పై సమంత ఇంకోస్సారి.?

- September 08, 2023 , by Maagulf
బిగ్‌బాస్ స్టేజ్‌పై సమంత ఇంకోస్సారి.?

బిగ్‌బాస్ స్టేజ్‌పై సమంత ఇంకోస్సారి మెరవనుందట. గతంలో నాగార్జున అందుబాటులో లేని కారణంగా ఓ వీకెండ్ ఎపిసోడ్‌ని సమంత తన భుజాలపై వేసుకుని బాధ్యత తీసుకుంది. 

ఆ ఎపిసోడ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది కూడా. అయితే, ఇప్పుడు ఇంకోసారి సమంతను బిగ్ బాస్ స్టేజ్‌పై చూడాలనుకుంటున్నారట బిగ్‌బాస్ మేకర్లు.

అందుకోసం ఆమెను సంప్రదించారట. అయితే, ‘ఖుషి’ సినిమా ప్రమోషన్లలో భాగంగా, తొలి రోజు బిగ్‌బాస్ షోకే సమంతను ఆహ్వానించారట అయితే, అందుకు సమంత నో చెప్పిందట.

అయితే, మీ హీరోయిన్ రాలేదే.. సమంత అని నాగార్జున విజయ్ దేవరకొండని అడిగేసరికి అక్కినేని ఫ్యామిలీకి అది కలిసొచ్చేసింది. కానీ, సమంత ఇప్పుడు ఫీలవుతోందట. అరెరె వెళ్లి వుంటే బాగుండేదే.. అని.

అయితే, ఎప్పుడో కప్పుడు సీజన్ ముగిసేలోగా సమంత ఒకసారి బిగ్‌బాస్ స్టేజ్‌పై సందడి చేయనుందనీ తెలుస్తోంది. బిగ్‌బాస్ టీమ్ సమంతని తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఇంకా మానలేదట. సో, సమంతను ఇంకోసారి బిగ్‌బాస్ స్టేజ్‌పై చూస్తామని అంటున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com